Friday, 15 December 2017

Ap government text books

* ఈ లింక్ లో 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రతి అకడమిక్ బుక్స్ అందుబాటులో  ఉన్నాయి. సో అకాడమీ బుక్స్ అవసరం ఉన్న వాళ్ళు డౌన్లోడ్ చేసుకోండి.*_

_*ప్రతి పుస్తకము మనం ప్రతి చోటుకి తీసుకవేళ్లలేం కదా సో డౌన్లోడ్ చేసుకొని కావాల్సినప్పుడు చూసుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది.*


  *_AP & Telangana academic text books from 1-10 th class (EM,TM and Urdu )_*

👉 _*Andhra Pradesh..*_
http://apscert.gov.in/ebook.html

👉 _*Telangana...*

http://scert.telangana.gov.in/?q=node/10

*DSC మరియు TET మెటీరియల్.. మోడల్ పేపర్స్  ఒకే లింక్ లో*

*మొత్తం 200 above  PDF ఫైల్స్*
https://drive.google.com/folderview?id=0B3NkIkgzJ3TJNGctS1g4eFhtUE0


 *StudyMaterial links*

1) 700+ Indian polity and Constitution
pdf link—
smartprep.in/wp-content/uploads/2016/12/Indian_Polity_and_Constitution_O-1.pdf

2) Indian history questions
pdf link —
smartprep.in/wp-content/uploads/2016/12/1500_Indian_History_Objective_Practice_Questions_Answers_SmartPrep.pdf

3) world geography
pdf link—
pdf link— smartprep.in/wp-content/uploads/2016/12/World_Geography_Objective_Questions_SmartPrep.pdf
4) Indian Geographyu
pdf link—
smartprep.in/wp-content/uploads/2016/12/Indian_Geography_Objective_Questions_SmartPrep.pdf

5) Indian Economy
pdf link —
smartprep.in/wp-content/uploads/2016/12/Indian_Economy_Objective_Questions_SmartPrep.pdf

6) Physics
pdf link —
smartprep.in/wp-content/uploads/2016/12/Physics_QuestionsnAnswers_with_explanation-1.pdf

7) Chemistry
pdf link —
smartprep.in/wp-content/uploads/2016/12/100-Questions-on-Chemistry-with-explanation.pdf

8) Biology
pdf link —
smartprep.in/wp-content/uploads/2016/12/200-Questions-on-Biology-with-explanation.pdf

******

Tuesday, 12 December 2017

Objective Mode Exams Orientation Training Programme| APSCERT | Social | BS & PS | Maths |


 A complete live of AP SA1 Objective mode of  exam orientation program . click on the video  given below.


2018 year wonder

* world's eighth wonder *
     
 *(2018)*

01-01-2018 Sunday
02-02-2018 Sunday
03-03-2018 Sunday
04-04-2018 Sunday
05-05-2018 Sunday
06-06-2018 Sunday
07-07-2018 Sunday
08-08-2018 Sunday
09-09-2018 Sunday
10-10-2018 Sunday
11-11-2018 Sunday
12-12-2018 Sunday

What a wonderful year . Share to your all friends.

Friday, 8 December 2017

Atma gourava deeksha in vikas

బహిరంగ తొలగింపు అనేది బయటినుండి మలాన్ని  తొలిగించడం మరియు నిర్మించుకున్న టాయిలెట్లను లను   వాడడం  కాదు. సమాజ నేతృత్వంలోని మొత్తం పారిశుధ్యపు (CLTS) కార్యక్రమాలకు "ఓపెన్ డెఫెక్సేషన్ ఫ్రీ" (ODF) అనేది ప్రధాన కేంద్రం మరియు ప్రధానంగా మొత్తం సమాజంలో బహిరంగ మల విసర్జన     యొక్క నిర్మూలనే.

   


ఇందులో భాగంగా నెల్లూరులోని 950 పంచాయతీలలో కలెక్టర్ గారు చేపట్టిన 41 రోజుల దీక్షలో వివిధ రకాల కళాకారులూ వివిధ  ప్రాంతాలలో  వారియెక్క ప్రదర్శనల ద్వారా బాహ్య మల విసర్జనను నిర్మూలీంపజేయాలి అనే ఉద్దేశంతో ఈ రోజు మా పాఠశాలలో జరిగిన చిన్నకార్యక్రం.

        దీనినీ దృష్టిలో ఉంచుకొని మనమందరం బాహ్య మలవిసర్జనను నిర్మూలించి రోగాల నుండి విముక్తి పొందుదాం.   జై  స్వచ్ఛ భారత్.

Wednesday, 6 December 2017

ap tet



 టెట్‌' పాసైతేనే డీఎస్సీ!

@ ఎన్‌సీటీఈ రూల్స్‌ ప్రకారం తప్పనిసరి

@ వారంలోగా టెట్‌ నోటిఫికేషన్‌ జారీ

@ 80% మార్కులకు డీఎస్సీ.

@ టెట్‌కు 20% వెయిటేజి

@ డీఎస్సీకి వయోపరిమితి 42 ఏళ్లు

 @ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌)లో పాసైన వారికే డీఎస్సీలో టీచర్‌ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అర్హత.

 @ డీఎస్సీ-2014లో మాదిరిగా ఈసారి టెట్‌ - డీఎస్సీ సిలబ్‌సతో కలిపి రాత పరీక్షలు నిర్వహించడం లేదని విద్యాశాఖ తెలిపింది.

 @ నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ (ఎన్‌సీటీఈ) నిబంధనల ప్రకారం ఉపాధ్యాయునిగా ఎంపిక కావాలంటే తప్పనిసరిగా టెట్‌ పాసై ఉండాలని స్పష్టం చేయడంతో పాఠశాల విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

 @ ఈసారి ఆన్‌లైన్‌లో టెట్‌ నిర్వహించాలని నిర్ణయించారు. డీఎస్సీ షెడ్యూల్‌ ప్రకటించిన నేపథ్యంలో ఈ వారంలోనే టెట్‌ నిర్వహణకు సంబంధించిన ఉత్తర్వులనూ విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ సిద్ధమవుతోంది.

 @ జీవో విడుదల కాగానే నోటిఫికేషన్‌ జారీ అయ్యే అవకాశం ఉంది. జనవరి నెలాఖరులోగా టెట్‌ నిర్వహించాలని భావిస్తున్నారు.

  @ రాష్ట్రంలో నిర్వహించే తొలి టెట్‌ ఇదే కానుంది. ఉమ్మడి రాష్ట్రంలో మూడు పర్యాయాలు టెట్‌ నిర్వహించారు.

 @ రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో రెండు సార్లు టెట్‌ నిర్వహించగా ఏపీలో మాత్రం నిర్వహించలేదు.

 @ ఇదిలా ఉండగా.. గతంలో నిర్వహించిన టెట్‌లో పాసైన అభ్యర్థులకు అప్పటి నుంచి ఏడేళ్లపాటు ఆ సర్టిఫికెట్‌ ఉపయోగపడుతుంది. అంటే ఆ సర్టిఫికెట్‌తో డీఎస్సీకి దరఖాస్తు చేసుకునే వీలుంది.

  @ ఆయా అభ్యర్థులు మళ్లీ ఇప్పుడు టెట్‌ రాసి క్వాలిఫై అయితే ఈ రెండింటిలో దేనిలో ఎక్కువ మార్కులు వస్తే వాటిని పరిగణనలోకి తీసుకుంటారు.

 @ డీఎస్సీని 80 శాతం మార్కులకు నిర్వహిస్తారు. టెట్‌లో అభ్యర్థులు పొందిన మార్కులకు 20 శాతం వెయిటేజి కల్పిస్తారు.

 @ ఆన్‌లైన్‌లో టెట్‌ నిర్వహిస్తున్నందున ఆలస్యం లేకుండా త్వరితగతిన ఫలితం వస్తుందని పాఠశాల విద్యాశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.

@ డీఎస్సీకి ముందుగా టెట్‌:@

@ సంధ్యారాణి రాష్ట్ర విభజన తర్వాత మొదటిసారిగా ఉపాధ్యాయ అభ్యర్థులకు ప్రత్యేకంగా టెట్‌ నిర్వహిస్తామని ఆ తర్వాత షెడ్యూల్‌ మేరకు డీఎస్సీని నిర్వహిస్తామని పాఠశాల విద్యా కమిషనర్‌  తెలిపారు.@

 @ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ పాఠశాలల టీచర్లందరికీ టెట్‌ తప్పనిసరి చేశారు.@

 @ డీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్న పోస్టులు 12,370గా ప్రకటించినప్పటికీ ఇందులో స్వల్ఫంగా మార్పులు ఉండవచ్చు.@

  @ ఇప్పుడు ప్రకటించిన పోస్టుల్లో ఆర్థికశాఖకు పంపిన 3407 పోస్టులు కూడా కలిపే ఉన్నాయని తెలిపారు. డీఎస్సీ -2014 ద్వారా 8,926 టీచర్‌ పోస్టులు భర్తీ కానున్నాయి.

@ డీఎస్సీకి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కూడా 42 సంవత్సరాల గరిష్ఠ వయోపరిమితి ఉత్తర్వులు వర్తిస్తాయని సంధ్యారాణి స్పష్టం చేశారు.*


 @ టీచర్ల నియామక పరీక్షల బాధ్యత ఏపీపీఎస్సీకి?

@ ఉన్నతాధికారులతో మంత్రి చర్చలు@

@ పరీక్షల నిర్వహణకు సర్వీస్‌ కమిషన్‌ ఓకే!@


@ ఉపాధ్యాయ పోస్టుల నియామక పరీక్షల బాధ్యతను ఏపీపీఎస్సీకి అప్పగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటి వరకు పాఠశాల విద్యా కమిషనరేట్‌ ఆధ్వర్యంలో జిల్లా ఎంపిక కమిటీ(డీఎస్సీ)ల ద్వారా ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

@ అన్ని జిల్లాలకు కలిపి కామన్‌గా రాత పరీక్షలు నిర్వహించి.. మార్కులను మాత్రం జిల్లాల వారీగా పంపిస్తున్నారు.


@ జిల్లాలో ఉన్న పోస్టుల సంఖ్యకు అనుగుణంగా రిజర్వేషన్లు, రోస్టర్‌ పాయింట్లను నిర్ధారించేవారు.


@ అయితే, ఈ పరీక్షల నిర్వహణ బాధ్యతను ఏపీపీఎస్సీకి అప్పగించాలని సర్కారు యోచిస్తోంది.


@ ఈ క్రమంలో దీనిపై బుధవారం మంత్రి గంటా శ్రీనివాసరావు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌, సీఎం కార్యాలయ కార్యదర్శి గిరిజా శంకర్‌లతో చర్చించారు. అలాగే, ఏపీపీఎస్సీ చైర్మన్‌ ఉదయభాస్కర్‌తోనూ మాట్లాడారు. ఈ ప్రతిపాదనకు సదరు ఉన్నతాధికారులు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.@

@ టీచర్ల నియామక పరీక్షల నిర్వహణ బాధ్యతను తీసుకునేందుకు ఏపీపీఎస్సీ చైర్మన్‌ సుముఖత వ్యక్తం చేశారు.

 @ తెలంగాణలో ఇప్పటికే ఈ బాధ్యతల్ని టీఎస్ పీఎస్సీకి అప్పగించారు. ఏపీలో విషయంపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు.





DSC notification detailed

Flash flash

ఆంధ్రప్రదేశ్‌ డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల :


 ఆశావాహులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆంధ్రప్రదేశ్‌ డీఎస్సీ నోటిఫికేషన్‌ను మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం ప్రకటించారు. ఈ నెల 15న సిలబస్‌, నోటిఫికేషన్‌ను విడుదల చేస్తామని చెప్పారు. మొత్తం 12,370 పోస్టులకు డిసెంబర్‌ 26 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు.
 *** AP నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. డీఎస్సీ ద్వారా రాష్ట్రంలో భారీగా ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి షెడ్యూల్‌ ప్రకటించింది. ఈ మేరకు సచివాలయంలో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రకటనను రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. డీఎస్సీ ద్వారా రాష్ట్రంలో మొత్తం 12,370 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నట్టు ఆయన వెల్లడించారు. 2018 జూన్‌ 12 నాటికి ఉపాధ్యాయులకు పోస్టింగ్‌లు ఇవ్వాలని నిర్ణయించినట్టు ఆయన చెప్పారు. ఇందుకోసం డిసెంబర్‌ 26 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 2వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్టు తెలిపారు.
గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి తెలిపారు. మార్చి 23,24,26 తేదీల్లో జరిగే ఈ పరీక్షలకు అభ్యర్థులు సిద్ధం కావాలని ఆయన సూచించారు. హాల్‌ టిక్కెట్లును వచ్చే ఏడాది మార్చి 9 వరకు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చన్నారు. స్కూల్‌ అసిస్టెంట్‌, ఎస్జీటీ, లాంగ్వేజ్‌ పండింట్‌ ఉద్యోగాలు 10,313తో పాటు తొలి దశలో మోడల్‌ పాఠశాలల్లో 1197 ఉద్యోగాలు, ప్రత్యేక అవసరాలు కల్గిన విద్యార్థుల కోసం మరో 860 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు.
ముఖ్యమైన తేదీలివే..
* డీఎస్సీ నోటిఫికేషన్‌ - డిసెంబర్‌ 15న
* దరఖాస్తుల స్వీకరణ:  డిసెంబర్‌ 26 నుంచి ఫిబ్రవరి 2 వరకు (ఆన్‌లైన్‌లో)
* హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు చివరి తేదీ: మార్చి 9
* రాత పరీక్షలు : మార్చి 23,24,26
* రాత పరీక్ష కీ విడుదల : ఏప్రిల్‌ 9న
* కీపై అభ్యంతరాల స్వీకరణ: ఏప్రిల్‌ 10 నుంచి 16 వరకు
* తుది కీ విడుదల తేదీ: ఏప్రిల్‌ 30
* మెరిట్ లిస్ట్ మే5

Sunday, 3 December 2017

Flash Flash DSC latest information

*డీఎస్సీకి వేళాయె*


👍 నెలాఖరులోగా ప్రకటన విడుదల చేస్తామని సుప్రీంకోర్టుకు తెలిపిన ప్రభుత్వం.🍃*


👍 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. నెలాఖరులోగా డీఎస్సీ ప్రకటన విడుదల చేస్తామని సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

👍 ఈ నేపథ్యంలో జిల్లాలో ఖాళీలపై విద్యాశాఖ కసరత్తు చేసి ప్రభుత్వానికి వివరాలు పంపింది.

👍 భవిష్యత్తు అవసరాలు అంటే 2020 వరకూ జిల్లాలో ఏర్పడే ఖాళీలను కూడా పరిగణనలోకి తీసుకుంటే అన్ని కేటగిరీలు కలిపి 1025 పోస్టులు వున్నట్టు గుర్తించారు.

👍 వీటిలో 2017 అక్టోబర్‌ నెలాఖరు వున్న ఖాళీలే ఎక్కువగా వున్నాయి. 2019 ఎన్నికల సంవత్సరం కానున్నందున వచ్చే ఏడాది ఖాళీల భర్తీకి ప్రభుత్వం నిర్ణయించింది.

👍 అయితే 2020 వరకు వున్న ఖాళీలను కూడా పరిగణనలోకి తీసుకుని ఇప్పుడే నియమించి...ఆ మేరకు హామీ పత్రాలు ఇస్తారా? అనేది డీఎస్సీ ప్రకటన విడుదల చేస్తేగానీ తెలియదు.

👍 2020 వరకు ఏర్పడబోయే ఖాళీలు పరిశీలిస్తే అన్ని కేటగిరీలు కలిపి స్కూల్‌ అసిస్టెంట్లు 410, పండిట్లు మూడు, ఎస్జీటీలు 610...వెరసి 1025గా గుర్తించారు.*

👍 ఖాళీలు గుర్తించినప్పుడు అధికారులు సంవత్సరాల వారీగా విభజించారు. వీటిలో 2017 అక్టోబర్‌ నెలాఖరు వరకు స్కూల్‌ అసిస్టెంట్లు 76, పండిట్లు ఒకటి, ఎస్జీటీలు 552 వెరసి 628గా గుర్తించారు.

👍 ఎస్జీటీలో 552లో 260 పోస్టులు బ్యాక్‌లాగ్‌ కేటగిరీకి సంబంధించినవి. అంటే తాజాగా ఏర్పడే ఖాళీలు 292 మాత్రమే.

👍 అదే స్కూల్‌ అసిస్టెంట్‌ కేటగిరీలో బ్యాక్‌లాగ్‌ ఎనిమిది, తాజా ఖాళీలు 68. ఇక 2017 నవంబర్‌ ఒకటి నుంచి 2018 మే నెలాఖరు వరకు కేవలం 12 ఖాళీలు మాత్రమే వున్నట్టు గుర్తించారు.

👍 స్కూల్‌ అసిస్టెంట్లు ఆరు, ఎస్జీటీలు ఆరు ఖాళీలు అవుతాయి. 2018 జూన్‌ ఒకటి నుంచి 2019 మే నెలాఖరు వరకు స్కూల్‌ అసిస్టెంట్లు 20, ఎస్జీటీలు 24, 2019 జూన్‌ ఒకటి నుంచి 2020 మే నెలాఖరు వరకు స్కూల్‌ అసిస్టెంట్లు 23, ఎస్జీటీలు 39 ఖాళీలు అవుతాయని విద్యాశాఖ గుర్తించింది.

👍 సాధారణంగా డీఎస్సీ ప్రకటన విడుదల చేసేనాటికి వున్న ఖాళీలను మాత్రమే దాంట్లో పొందుపర్చుతారు. అదే జరిగితే ఈ నెలాఖరులో ప్రకటన విడుదల చేసినట్టయితే 629 ఖాళీలు మాత్రమే భర్తీకి అవకాశం వుంటుంది.

👍 అలా కాదు..2008 మాదిరిగా భవిష్యత్తు అవసరాలను పరిగణనలోకి తీసుకుంటే జిల్లాలో మొత్తం 1025 ఖాళీలు భర్తీ చేయడానికి అవకాశం వుంది. డీఎస్సీ అనగానే కనీసం వెయ్యి నుంచి రెండు వేల వరకు పోస్టులు భర్తీచేస్తారు.

👍 2014 డీఎస్సీలో పోస్టులను 2016లో భర్తీచేశారు. అయితే ఏటేటా ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల చేరిక తగ్గుతుంది.

👍 ప్రధానంగా ఐదో తరగతిలోపు చేరే వారి సంఖ్య తక్కువగా కనిపిస్తోంది. జనాభా నియంత్రణతో కుటుంబాల్లో పిల్లల సంఖ్య తగ్గడం కూడా ఒక కారణంగా పేర్కొనవచ్చు.

👍 ఇంకా విద్యార్థులు తక్కువగా వున్న పాఠశాలల మూత, సమీప పాఠశాలల్లో విలీనం వంటి చర్యల వల్ల టీచర్ల సంఖ్య మిగులు చూపించారు.

👍 వీటన్నింటి నేపథ్యంలో ఉపాధ్యాయ ఖాళీల సంఖ్య తక్కువగా వుందనేది విద్యాశాఖ వర్గాల అభిప్రాయం.

Children dressed in traditional attire take part in cultural activities

Children dressed in traditional attire take part in cultural activities : Kite-flying, ‘gobbemmalu’, colourful ‘rangoli’, fun and froli...