Showing posts with label ap tet. Show all posts
Showing posts with label ap tet. Show all posts

Wednesday, 6 December 2017

ap tet



 టెట్‌' పాసైతేనే డీఎస్సీ!

@ ఎన్‌సీటీఈ రూల్స్‌ ప్రకారం తప్పనిసరి

@ వారంలోగా టెట్‌ నోటిఫికేషన్‌ జారీ

@ 80% మార్కులకు డీఎస్సీ.

@ టెట్‌కు 20% వెయిటేజి

@ డీఎస్సీకి వయోపరిమితి 42 ఏళ్లు

 @ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌)లో పాసైన వారికే డీఎస్సీలో టీచర్‌ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అర్హత.

 @ డీఎస్సీ-2014లో మాదిరిగా ఈసారి టెట్‌ - డీఎస్సీ సిలబ్‌సతో కలిపి రాత పరీక్షలు నిర్వహించడం లేదని విద్యాశాఖ తెలిపింది.

 @ నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ (ఎన్‌సీటీఈ) నిబంధనల ప్రకారం ఉపాధ్యాయునిగా ఎంపిక కావాలంటే తప్పనిసరిగా టెట్‌ పాసై ఉండాలని స్పష్టం చేయడంతో పాఠశాల విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

 @ ఈసారి ఆన్‌లైన్‌లో టెట్‌ నిర్వహించాలని నిర్ణయించారు. డీఎస్సీ షెడ్యూల్‌ ప్రకటించిన నేపథ్యంలో ఈ వారంలోనే టెట్‌ నిర్వహణకు సంబంధించిన ఉత్తర్వులనూ విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ సిద్ధమవుతోంది.

 @ జీవో విడుదల కాగానే నోటిఫికేషన్‌ జారీ అయ్యే అవకాశం ఉంది. జనవరి నెలాఖరులోగా టెట్‌ నిర్వహించాలని భావిస్తున్నారు.

  @ రాష్ట్రంలో నిర్వహించే తొలి టెట్‌ ఇదే కానుంది. ఉమ్మడి రాష్ట్రంలో మూడు పర్యాయాలు టెట్‌ నిర్వహించారు.

 @ రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో రెండు సార్లు టెట్‌ నిర్వహించగా ఏపీలో మాత్రం నిర్వహించలేదు.

 @ ఇదిలా ఉండగా.. గతంలో నిర్వహించిన టెట్‌లో పాసైన అభ్యర్థులకు అప్పటి నుంచి ఏడేళ్లపాటు ఆ సర్టిఫికెట్‌ ఉపయోగపడుతుంది. అంటే ఆ సర్టిఫికెట్‌తో డీఎస్సీకి దరఖాస్తు చేసుకునే వీలుంది.

  @ ఆయా అభ్యర్థులు మళ్లీ ఇప్పుడు టెట్‌ రాసి క్వాలిఫై అయితే ఈ రెండింటిలో దేనిలో ఎక్కువ మార్కులు వస్తే వాటిని పరిగణనలోకి తీసుకుంటారు.

 @ డీఎస్సీని 80 శాతం మార్కులకు నిర్వహిస్తారు. టెట్‌లో అభ్యర్థులు పొందిన మార్కులకు 20 శాతం వెయిటేజి కల్పిస్తారు.

 @ ఆన్‌లైన్‌లో టెట్‌ నిర్వహిస్తున్నందున ఆలస్యం లేకుండా త్వరితగతిన ఫలితం వస్తుందని పాఠశాల విద్యాశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.

@ డీఎస్సీకి ముందుగా టెట్‌:@

@ సంధ్యారాణి రాష్ట్ర విభజన తర్వాత మొదటిసారిగా ఉపాధ్యాయ అభ్యర్థులకు ప్రత్యేకంగా టెట్‌ నిర్వహిస్తామని ఆ తర్వాత షెడ్యూల్‌ మేరకు డీఎస్సీని నిర్వహిస్తామని పాఠశాల విద్యా కమిషనర్‌  తెలిపారు.@

 @ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ పాఠశాలల టీచర్లందరికీ టెట్‌ తప్పనిసరి చేశారు.@

 @ డీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్న పోస్టులు 12,370గా ప్రకటించినప్పటికీ ఇందులో స్వల్ఫంగా మార్పులు ఉండవచ్చు.@

  @ ఇప్పుడు ప్రకటించిన పోస్టుల్లో ఆర్థికశాఖకు పంపిన 3407 పోస్టులు కూడా కలిపే ఉన్నాయని తెలిపారు. డీఎస్సీ -2014 ద్వారా 8,926 టీచర్‌ పోస్టులు భర్తీ కానున్నాయి.

@ డీఎస్సీకి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కూడా 42 సంవత్సరాల గరిష్ఠ వయోపరిమితి ఉత్తర్వులు వర్తిస్తాయని సంధ్యారాణి స్పష్టం చేశారు.*


 @ టీచర్ల నియామక పరీక్షల బాధ్యత ఏపీపీఎస్సీకి?

@ ఉన్నతాధికారులతో మంత్రి చర్చలు@

@ పరీక్షల నిర్వహణకు సర్వీస్‌ కమిషన్‌ ఓకే!@


@ ఉపాధ్యాయ పోస్టుల నియామక పరీక్షల బాధ్యతను ఏపీపీఎస్సీకి అప్పగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటి వరకు పాఠశాల విద్యా కమిషనరేట్‌ ఆధ్వర్యంలో జిల్లా ఎంపిక కమిటీ(డీఎస్సీ)ల ద్వారా ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

@ అన్ని జిల్లాలకు కలిపి కామన్‌గా రాత పరీక్షలు నిర్వహించి.. మార్కులను మాత్రం జిల్లాల వారీగా పంపిస్తున్నారు.


@ జిల్లాలో ఉన్న పోస్టుల సంఖ్యకు అనుగుణంగా రిజర్వేషన్లు, రోస్టర్‌ పాయింట్లను నిర్ధారించేవారు.


@ అయితే, ఈ పరీక్షల నిర్వహణ బాధ్యతను ఏపీపీఎస్సీకి అప్పగించాలని సర్కారు యోచిస్తోంది.


@ ఈ క్రమంలో దీనిపై బుధవారం మంత్రి గంటా శ్రీనివాసరావు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌, సీఎం కార్యాలయ కార్యదర్శి గిరిజా శంకర్‌లతో చర్చించారు. అలాగే, ఏపీపీఎస్సీ చైర్మన్‌ ఉదయభాస్కర్‌తోనూ మాట్లాడారు. ఈ ప్రతిపాదనకు సదరు ఉన్నతాధికారులు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.@

@ టీచర్ల నియామక పరీక్షల నిర్వహణ బాధ్యతను తీసుకునేందుకు ఏపీపీఎస్సీ చైర్మన్‌ సుముఖత వ్యక్తం చేశారు.

 @ తెలంగాణలో ఇప్పటికే ఈ బాధ్యతల్ని టీఎస్ పీఎస్సీకి అప్పగించారు. ఏపీలో విషయంపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు.





Children dressed in traditional attire take part in cultural activities

Children dressed in traditional attire take part in cultural activities : Kite-flying, ‘gobbemmalu’, colourful ‘rangoli’, fun and froli...